సికింద్రాబాద్ పరిధిలోని స్విగ్గీ డెలివరీ బాయ్‌‌‌‌‌‌‌‌ పై సీఐ ప్రతాపం

సికింద్రాబాద్ పరిధిలోని స్విగ్గీ డెలివరీ బాయ్‌‌‌‌‌‌‌‌ పై సీఐ ప్రతాపం
  •     చెప్పే సమాధానం కూడా వినకుండా లాఠీతో దాడి

పద్మారావునగర్, వెలుగు: స్విగ్గీ డెలివరీ బాయ్​పై సికింద్రాబాద్​పరిధిలోని రామ్​గోపాల్​పేట్ సీఐ సురేశ్ ప్రతాపం చూపించారు. కనీసం చెప్పే సమాధానం కూడా వినకుండా లాఠీతో  విచక్షణారహితంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ తన విధుల్లో భాగంగా ఆర్డర్ ఇచ్చేందుకు వెళ్తుండగా, మార్గమధ్యలో సీఐ సురేశ్ అతడిని అడ్డుకున్నారు. 

‘ఏం డెలివరీ చేస్తున్నావు?’ అని ప్రశ్నిస్తూనే, ఆ యువకుడు సమాధానం చెప్పేలోపే సీఐ తన చేతిలోని లాఠీతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు కావడంతో సీఐ అత్యుత్సాహం బయటపడింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు.