Rana Naidu Season 2: వెంకటేష్, రానా 'రానా నాయుడు సీజన్ 2' టీజర్ రిలీజ్

Rana Naidu Season 2: వెంకటేష్, రానా 'రానా నాయుడు సీజన్ 2' టీజర్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'రానా నాయుడు సీజన్ 1'కు ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. తాజాగా రానా నాయుడు సీజన్ 2 కు సంబంధించిన ఓ టీజర్ వీడియోను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దాంతో పాటు మరేం చింతించకండి.. మీ బాధనంతనంటినీ పోగొట్టడానికి నాయుడులు మళ్లీ తిరిగి వస్తున్నారు.. రానా నాయుడు సీజన్ 2 త్వరలోనే విడుదల కానుందంటూ నెట్ ఫ్లిక్స్ రాసుకొచ్చింది. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తి్స్తోన్న ఈ సీజన్ 2 గ్లింప్సెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా రూపొందించిన 'రానా నాయుడు' సిరీస్ మార్చి10న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. విడుదలైన మూడు వారాల పాటు భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా నంబర్.1 స్థానంగా నిలిచి ట్రెండ్ స-ృష్టించింది.  వరుసగా ఐదవ వారంలోనూ దేశంలోని టాప్ 10 సిరీస్‌లలో ఒకటిగా రానా నాయుడు దూసుకుపోతోంది. విడుదలైన రెండు వారాల పాటు నాన్-ఇంగ్లీష్ టీవీ షోల కోసం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో 'రానా నాయుడు' కూడా ట్రెండ్ అయ్యాడు.

సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ 'రానా నాయుడు' సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ రూపొందించారు, సహ-దర్శకత్వం కూడా వహించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, సుశాంత్ సింగ్, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ పలు కీలక పాత్రలు పోషించారు.

https://twitter.com/NetflixIndia/status/1648544450749124609