ఇన్ స్టాలో మిహికా పోస్ట్.. ఖంగుతిన్న నెటిజన్లు

ఇన్ స్టాలో మిహికా  పోస్ట్.. ఖంగుతిన్న నెటిజన్లు

టాలీవుడ్ క్యూట్ పెయిర్ రానా, మిహికలు వివాహబంధంలోకి అడుగు పెట్టి రెండేళ్లు గడుస్తోంది. ఇటీవల రాంచరణ్ ఉపాసన జంట తల్లిదండ్రులం కాబోతున్నామంటూ తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇలాంటి గుడ్ న్యూస్ కోసమే రానా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా మిహిక ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ నెటిజన్లను షాక్ కు గురిచేసింది. పొడవాటి గౌన్ ధరించి బీచ్ లో నడుస్తున్న ఓ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఇందులో మిహిక బేబీ బంప్ తో కనిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటి వరకూ ఈ జంట ఎలాంటి విషయం బయటకు వెల్లడించలేదు. కానీ, ఈ వీడియో చూసిన వారంతా రానాకు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు చేస్తుండటం విశేషం. 

గతంలోనూ ఇలాంటి వార్తలు రావడంతో వీరిద్దరూ అవన్నీ వట్టి పుకార్లేనంటూ కొట్టి పారేశారు. మరి ఈసారైనా వీరు గుడ్ న్యూస్ చెప్తారేమో వేచి చూడాలి. విరాట పర్వం తర్వాత రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో ఈ దగ్గుబాటి అబ్బాయి కనిపించాడు. కాంట్రవర్సీలతోనే ఈ వెబ్ కంటెంట్ కు కావలసినంత ప్రచారం లభించింది.  విమర్శించే వారితో పాటు నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను ఆదరించేవారి సంఖ్య కూడా భారీ గానే ఉంది. నెట్ ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో సైతం దీనికి చోటు దక్కింది. 

https://www.instagram.com/reel/Cqo0QJ6oNbb/?utm_source=ig_web_copy_link