అక్రమ మైనింగ్ముఠా నుంచి రక్షించండి.. రంగారెడ్డి జిల్లాకు చెందిన 6 గ్రామాల రైతుల ఆవేదన

అక్రమ మైనింగ్ముఠా నుంచి రక్షించండి.. రంగారెడ్డి జిల్లాకు చెందిన 6 గ్రామాల రైతుల ఆవేదన

పంజాగుట్ట, వెలుగు: అక్రమ మైనింగ్​ముఠా నుంచి తమను రక్షించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ మైనింగ్, స్టోన్ క్రషర్ల వల్ల తమ పంట పొలాలు, ఇండ్లు ధ్వంసమవుతున్నాయని, డస్ట్​వల్ల ఆహార పదార్థాలు పాడవుతున్నాయని, ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రాళ్లకత్వ, పోలకపల్లి, దాది గూడెం, కొండకంచి, శివ నగర్​, ఉట్ల గ్రామాల రైతులు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. 12 ఏండ్లుగా తాము ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని వాపోయారు.

పాఠశాలల బస్సులు ఊళ్లకు రావడం లేదని, చదువుకోవడానికి వెళ్లేందుకు తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి, స్యమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. రైతులు జీజే మురళి, జింక రవి, శ్రీకాంత్, రఘుపతి శ్రీనివాస్, లక్ష్మిపతి, రాములు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.