ఓటీటీలో విడుదలైన ‘రంగమార్తాండ’.. ఎందులో అంటే?

ఓటీటీలో విడుదలైన ‘రంగమార్తాండ’.. ఎందులో అంటే?

క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ లెటెస్ట్ సినిమా ‘రంగమార్తాండ’. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే, ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే టాక్ కూడా ఉంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయింది. 

కొన్ని సినిమాలు థియేటర్ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేశారు. అమేజాన్ లో దీనిని ప్రసారం చేస్తున్నారు. తెలుగు టాప్ కమెడియన్ గా పేరున్న బ్రహ్మానందం  సీరియస్ రోల్ లో కనిపించడం ఇందులో మరో విశేషం. శివాత్మిక రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు.

 మరాఠి సినిమా ‘నటసామ్రాట్’ కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. రాఘవరావు అనే రంగస్థల కళాకారుడిగా ప్రకాశ్ రాజ్ కనిపిస్తాడు. రాఘవరావు తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, సంఘర్షణను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ఇది ఓటీటీ ప్రేక్షకుల్లో ఎలాంటి స్పందనను తెచ్చుకుంటుందో వేచి చూడాలి.