ఇంట్లో ఫారిన్ లిక్కర్.. మాయం చేసిన దొంగలు

ఇంట్లో ఫారిన్ లిక్కర్.. మాయం చేసిన దొంగలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓ ఇంట్లో రాత్రివేళ చోరీకి పాల్పడిన దొంగలు నగదు, ఆభరణాలతో పాటు అక్కడున్న ఫారిన్​ లిక్కర్​నూ దోచుకెళ్లారు. రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల ఒకే రోజు రెండు ఇండ్లలో దొంగతనాలు జరిగాయి. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు రాఘవేంద్ర హోమ్స్ లో గల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో, అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడలోని ఎన్ఎస్ఆర్ నగర్ కాలనీలో నర్సింహారెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. 

శ్రీనివాస్​రెడ్డి ఇంట్లో 10 తులాల బంగారం, రూ.6 లక్షలు, ఒక ల్యాప్​టాప్, ఆరు స్మార్ట్ వాచ్​లు చోరీకి గురయ్యాయి. నర్సింహారెడ్డి ఇంట్లో పూజ గదిలో ఉన్న వెండి పూజా సామగ్రి, రూ.5 వేలు అపహరించిన దొంగలు.. అక్కడున్న ఫారిన్ మద్యం బాటిళ్లను కూడా ఎత్తుకెళ్లారు.