రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
  • రంగారెడ్డి కలెక్టర్ శశాంక
  •  ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష

ఎల్​నగర్, వెలుగు: జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ లో రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అధికారులు, మీడియా, ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. తాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయాశాఖలు సాధించిన ప్రగతి నివేదికలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి పంపించాలని పేర్కొన్నారు. వేడుకలకు పోలీసు బందోబస్త్ చేపట్టాలని సూచించారు. వేదికను అలంకరణ, విద్యుత్ అంతరాయం లేకుండా, కల్చరల్ ప్రోగ్రామ్స్ పై సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు ప్రతిమా సింగ్, భూపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏఓ ప్రమీల రాణి, సీపీఓ సౌమ్య, జిల్లా అధికారులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.

వానాకాలంలో ముంపు సమస్యలు రావొద్దు 

వచ్చే వానాకాలం దృష్ట్యా జల్ పల్లి మున్సిపాలిటి పరిధి ఉస్మాన్ సాగర్ కాలనీని రంగారెడ్డి కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఉస్మాన్ సాగర్ కాలనీ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ శశాంక జల్ పల్లి, బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇరిగేషన్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. 

వర్షాకాలంలో లోపు బుర్హాన్ ఖాన్ చెరువు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గుర్రపు డెక్కను, నాచును తొలగించాలని, చెరువు పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని పేర్కొన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకొని స్థానికులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.