రణవీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు.. రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ వాయిస్ నోట్!

రణవీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు.. రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ వాయిస్ నోట్!

బాలీవుడ్ సినీ ప్రముఖులను అండర్ వరల్డ్ భయం వెంటాడుతోంది.  లేటెస్ట్ గా స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కు బెదింపులు వచ్చాయి. రూ 10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీందో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ బెదిరింపులు లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు పోలీసు అనుమానిస్తున్నారు. దీనిపై క్రైం బ్రాంచ్ నేతృత్వంలో దర్యాప్తు  చేపట్టారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ పనేనా?..

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. రణవీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్‌కు ఒక వాయిస్ నోట్ వచ్చింది. ఇది అమెరికాకు చెందిన ఫోన్ నెంబర్ నుంచి వచ్చినట్లు కథనాలు వస్తున్నాయి.  లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన హ్యారీ బాక్సర్ ఈ వాయిస్ నోట్ పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో రూ. 10 కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల తర్వాతే..

కొద్ది రోజుల క్రితం ముంబైలోని ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ ఘటన జరిగిన కొన్ని రోజులకే రణవీర్ సింగ్‌కు ఈ బెదిరింపు రావడం సినీ ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది. ఈ రెండు సంఘటనల వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, ఆ నెంబర్ ఎవరిదో కనిపెట్టే పనిలో ఉన్నారు.

బలగాల పహారాలో రణవీర్ నివాసం

బెదిరింపుల నేపథ్యంలో రణవీర్ సింగ్ ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచారు. ముంబై పోలీసులతో పాటు రణవీర్ వ్యక్తిగత సాయుధ సెక్యూరిటీ కూడా నిరంతరం కాపలా కాస్తోంది.  ఒకవైపు బెదిరింపులు ఉండగానే, మరోవైపు రణవీర్ సింగ్ తన కెరీర్ పరంగా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.  గ్రిఫ్ట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రావాల్సిన 'డాన్ 3' నుంచి రణవీర్ తప్పుకున్నారు. దీనివల్ల తమకు రూ. 40 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రొడక్షన్ హౌస్ ఆరోపిస్తుండగా, అది కేవలం 'బిజినెస్ నేచర్' అని రణవీర్ కొట్టిపారేస్తున్నారు. 

ప్రస్తుతం రణవీర్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ధురంధర్ 2: ద రివెంజ్' (Dhurandhar 2) మార్చి 19, 2026న విడుదల కానుంది. సరిగ్గా అదే రోజు కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరగబోతోంది. గతేడాది 'ధురంధర్'తో రూ. 890 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.. భారీ అంచనాలతో వస్తున్న  'ధురంధర్ 2 ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.