మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారం

V6 Velugu Posted on Oct 16, 2021

సంగారెడ్డి జిల్లా: న్యాల్కల్ మండలం రేజింతల్ లో మతి స్థిమితంలేని మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. నిన్న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు దస్తగిర్ (46) డబ్బులు అశచూపి మైనర్ బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. నిందితుడిపై హద్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అత్యాచార ఘటనపై స్పందించి రేజింతల్  వచ్చిన జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.  నిందితుడిని కఠినంగా శిక్షించాలని హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. 

Tagged Telangana, Minor girl, Sangareddy, mentally handicapped, nyalkal mandal, mentally retorted, rejinthal village

Latest Videos

Subscribe Now

More News