మళ్లీ ఊపిరి... మళ్లీ మాట!...వ్యక్తికి కేర్ హాస్పిటల్ లో అరుదైన సర్జరీ

మళ్లీ ఊపిరి... మళ్లీ మాట!...వ్యక్తికి కేర్ హాస్పిటల్ లో అరుదైన సర్జరీ

గచ్చిబౌలి, వెలుగు: శ్వాసనాళం 90 శాతం మేర పూడుకుపోయి, మాట్లాడలేని స్థితిలో ఉన్న 60 ఏండ్ల వ్యక్తికి హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్ డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం తలెత్తిన శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్​కు చెందిన రోగిని పరీక్షించగా, ‘ట్రాకియల్ స్టెనోసిస్’ అనే క్లిష్టమైన సమస్య ఉన్నట్లు పల్మనాలజీ విభాగం గుర్తించింది. 

సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సతీశ్ సి రెడ్డి, ఈఎన్టీ నిపుణుడు డాక్టర్ అబ్దుల్ అమ్జాద్ ఖాన్ నేతృత్వంలోని బృందం ‘రిజిడ్ బ్రోంకోస్కోపీ’ ప్రక్రియను చేపట్టింది. ఎలక్ట్రో కాటరీ నైఫ్, బెలూన్ డైలటేషన్ పద్ధతుల ద్వారా మూసుకుపోయిన శ్వాసనాళాన్ని తెరిచి, తిరిగి సమస్య రాకుండా సిలికాన్ స్టెంట్​ను అమర్చారు. విజయవంతమైన ఈ చికిత్స తర్వాత రోగి ప్రస్తుతం సాధారణంగా శ్వాస తీసుకుంటూ, స్పష్టంగా మాట్లాడుతున్నారని డాక్టర్లు బుధవారం తెలిపారు.