రషీద్ ఖాన్ రికార్డ్.. టీ20ల్లో బౌండరీ ఇవ్వకుండా 100 బంతులు 

రషీద్ ఖాన్ రికార్డ్.. టీ20ల్లో బౌండరీ ఇవ్వకుండా 100 బంతులు 

టీ20 అంటేనే బ్యాటర్ల గేమ్. ప్రతి బాల్ బౌండరీ బాదుతూ బౌలర్లను ఊచకోత కోస్తుంటారు. కానీ, బ్యాటర్లంతా అఫ్గానిస్తాన్ కెప్టెన్ బౌలింగ్ లో ఆడటానికి భయపడుతున్నారు. టీ20ల్లో రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు బ్రేకులు వేస్తున్నాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ఎవరికీ సాధ్యంకాని, ఇప్పటివరకు ఎవరూ క్రియేట్ చేయని రికార్డును సృష్టించాడు. 

టీ20ల్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా బౌలింగ్ చేయడం చాలా తక్కువ. అలాంటిది అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా వరుసగా 100 బంతులు వేసి రికార్డు సృష్టించాడు రషీద్ ఖాన్. అయితే, నిన్న (మార్చి 27) జరిగిన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ చివరి టీ20లో 106వ డెలివరీ వేసినకి రషీద్ ఖాద్ తన రికార్డుకు బ్రేక్ వేశాడు. 106వ డెలివరీలో పాకిస్తాన్ బ్యాటర్ ఆయుబ్.. సిక్స్ కొట్టడంతో ఆ రికార్డుకు బ్రేక్ పడింది.