టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ బాక్సాఫీస్ వేట మొదలుపెట్టబోతున్నారు. 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్‌తో విజయ్ చేస్తున్నహిస్టారికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండటంతో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత ఈ హిట్ పెయిర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఎంతో అతృతగా వెయిట్ చేస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజువల్ వండర్‌గా నిర్మిస్తున్నారు.
90 శాతం షూటింగ్ కంప్లీట్..
ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది. 'రణబాలి' టీమ్ సక్సెస్ ఫుల్‌గా 100 రోజుల భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇటీవలే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఫేమస్ లొకేషన్ గండికోట కోట పరిసరాల్లో వారం రోజుల పాటు ఒక క్రేజీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక్కడి అద్భుతమైన లొకేషన్లలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య వచ్చే కొన్ని గుండెలను పిండేసే ఎమోషనల్ అండ్ రొమాంటిక్ సీన్స్ పిక్చరైజ్ చేశారు. ఈ షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై ఇటు డైరెక్టర్, అటు ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
►ALSO READ | Ashika Ranganath: తప్పు డైరెక్టర్లదే.. నటించిన హీరోయిన్లది కాదు.. జాన్వీ కపూర్‌కు సపోర్ట్‌గా కన్నడ బ్యూటీ ఆషికా!
బ్రిటిష్ కాలం నాటి కథతో...
కథ విషయానికి వస్తే.. 'రణబాలి' రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. 19వ శతాబ్దపు (1854 - 1878) నాటి బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీ కాబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రీసెంట్‌గా రౌడీ బాయ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. అందులో విజయ్ గుర్రపు స్వారీ చేస్తూ, కత్తులతో శత్రువులను వేటాడుతున్న ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్స్ చూశాక సినిమా రేంజ్ ఏంటో అందరికీ అర్థమైపోయింది. భారీ అంచనాలున్న 'రణబాలి' చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు.
❤️ @_ShwetaMohan_ https://t.co/nozpTOH2Zr
— RANABAALI (@RanabaaliFilm) March 1, 2026
