న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా షూటర్ల గురి అదురుతోంది. గురువారం జరిగిన జూనియర్ విమెన్స్10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రష్మిక సెహగల్ (237.9), వాన్షికా చౌదరీ (236.7) వరుసగా స్వర్ణం, రజతం నెగ్గారు. ఆసియిఫా రిహాదతుల్ (ఇండోనేసియా, 216.4)కు కాంస్యం దక్కింది. టీమ్ విభాగంలో రష్మిక-–వాన్షిక–ఆగమ్ గ్రేవాల్ త్రయం 1714 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. కజకిస్తాన్ (1671), శ్రీలంక (1631) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను సాధించాయి.
విమెన్స్ యూత్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ప్రియాన్షి పూర్వ (234.8), చాహెక్ కోహ్లా (233.0) వరుసగా గోల్డ్, సిల్వర్ నెగ్గారు. విమెన్స్ యూత్ ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో ప్రియాన్షి-–చాహెక్–-శిక్ష సరన్ త్రయం 1709 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో వరల్డ్ చాంపియన్ సామ్రాట్ రాణా–సురుచి సింగ్ జోడీ సిల్వర్ మెడల్‌తో మెరిసింది. ఫైనల్లో ఇండియా ద్వయం 479.6 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచింది. ఉజ్బెకిస్తాన్ షూటర్లు సైద్కులోవా నిగిన–కమలోవ్ ముహమ్మద్ 481.3 పాయింట్లతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఇండియా ఖాతాలో 10 స్వర్ణాలు, 5 రజతాలు, ఒక బ్రాంజ్ మెడల్ ఉన్నాయి.
