రేషన్ కార్డుల కోసం 18 నెలలుగా ఎదురుచూపులు

రేషన్ కార్డుల కోసం 18 నెలలుగా ఎదురుచూపులు
  • కొత్త రేషన్ కార్డుల కోసం 18 నెలలుగా ఎదురు చూపులు
  • పెండింగ్‌లో 9 వేల అప్లికేషన్లు
  • సర్కార్‌ సై అంటలేదంటున్న ఆఫీసర్లు
  • స్కీమ్‌ల లబ్ధికి దూరమవుతున్న పేదలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి అయిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సంగారెడ్డి జిల్లాలో నిలిచిపోయింది. దాదాపు 18 నెలలుగా కొత్త రేషన్ కార్డులు ఇస్తలేరు. కొత్త కార్డులు ఇవ్వకపోగా యాడిషన్స్, రేషన్ షాప్‌ల మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్లి కేషన్లు కూడా పెండింగ్‌లనే ఉన్నయ్. దీంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు . జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3,72,911 రేషన్ కార్డులు ఉండగా, ఇందులో తెల్లకార్డులు 3,45,707, అంత్యోదయ కార్డులు 27,099, అన్నపూర్ణ కార్డులు 105 ఉన్నాయి. ఏడాదిన్నరగా కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 9 వేల మంది అప్లయ్‌‌ చేసుకున్నా రు. వీరు రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు . రేషన్ కార్డు లేకపోతే.. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తిస్తారు.

ప్రజల ఆదాయ వనరుల అంచనా మొదలుకొని రేషన్ సరుకులు పొందడా నికి, ఆరోగ్య శ్రీ స్కీంలో ట్రీట్‌మెంట్ తీసుకోవడా నికి తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. కొత్త కార్డుల జారీతోపాటు పాత కార్డులో నమోదు చేయాల్సిన వివరాలు నిలిచిపోవడంతో సంక్షేమ పథకాలకు ఎంతో మంది పేదలు నోచుకోవడం లేదు. రేషన్ కార్డులు లేక ఎంతో మంది ఆరోగ్య శ్రీ ట్రీట్‌మెంట్‌కు దూరమవుతున్నారు. ఎమర్న్జె సీ కేసుల్లో కలెకర్‌్ట స్పెషల్‌ పర్మిషన్‌‌తో కొందరికి ట్రీట్‌మెంట్‌అందుతున్నా ఆ ప్రాసెస్‌కు చాలా టైం పడుతోందని బాధితులు వాపోతున్నారు . పర్మిషన్‌‌దొరికే దాకా పేషెంట్లు ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు . కొత్త కార్డుల గురించి ఆఫీ సర్లను అడిగితే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదం టున్నారు . దీంతో కార్డుల జారీకి సర్కార్‌ ఎప్పుడు అనుమతిస్తుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు .

సర్కార్‌కొత్త రేషన్‌ కార్డులియ్యక 18 నెలలైంది. దీంతో వీటి కోసం అప్లయ్‌ చేసుకున్నోళ్లంతా ఎప్పుడస్తదోనని ఆశగా ఎదురుచూస్తుండ్రు. కానీ ఆఫీసర్లేమో సర్కార్‌ సై అంటలేదు, అందుకే పెండింగ్‌లో ఉన్నయంటుండ్రు. సర్కార్‌‌‌‌పెట్టి న స్కీమ్‌లన్నింటికి తెల్ల రేషన్‌కార్డే ప్రామాణికం కావడంతో అర్హు లంతా లాస్‌ అయితుండ్రు. పెద్దలు దయతలిచి కొత్త కార్డు లు ఇప్పియ్యాలని కోరుతుండ్రు.