మొదటి క్వార్టర్​లో 7.5 శాతం వృద్ధి

 మొదటి క్వార్టర్​లో 7.5 శాతం వృద్ధి
  •      ఆర్​బీఐ అంచనా  

ముంబై: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న  డిమాండ్,  ఆహారేతర వ్యయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో భారతదేశం 7.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్​బీఐ మే బులెటిన్‌‌‌‌ పేర్కొంది.  సరఫరా గొలుసుపై భౌగోళిక, రాజకీయ ఇబ్బందులు ప్రభావం చూపుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందని ప్రశంసించింది. ఆర్​బీఐ ఆర్థిక కార్యకలాపాల సూచిక (ఈఏఐ) ప్రకారం, ఏప్రిల్‌‌‌‌లో కార్యకలాపాలు పుంజుకున్నాయి.

ప్రభుత్వం జనవరి–-మార్చి, 2024 (నాలుగో క్వార్టర్ 2023-–24) క్వార్టర్లీ జీడీపీ అంచనాలను,  2023–-24 సంవత్సరానికి జాతీయ ఆదాయం  తాత్కాలిక అంచనాలను మే 31న విడుదల చేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ జూన్ క్వార్టర్లో 8.2 శాతం, సెప్టెంబర్ క్వార్టర్లో 8.1 శాతం,  2023–-24 డిసెంబర్ క్వార్టర్లో 8.4 శాతం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్​లో టోల్ వసూళ్లు 8.6 శాతం (వార్షికంగా) పెరిగాయి. ఆటోమొబైల్ అమ్మకాలు  25.4 శాతం పెరిగాయి.

టూ, త్రీవీలర్లు భారీగా అమ్ముడయ్యాయి. అయితే ప్రయాణీకుల వాహనాలు రికార్డుస్థాయిలో అమ్ముడయ్యాయి. ఇదిలా ఉంటే భారతదేశం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎకానమిక్​ టేకాఫ్‌‌‌‌ మొదలయిందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఈ బులెటిన్​ పేర్కొంది. ఒక వర్ధమాన దేశం సంపన్నదేశంగా మారే దశను ఎకానమిక్​టేకాఫ్​అంటారు.

ఆహారేతర వ్యయం పెరుగుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని తెలిపింది.  గత రెండు సంవత్సరాలలో మొదటిసారిగా, గ్రామాల నుంచి  ఎఫ్​ఎంసీజీ ప్రొడక్టులకు డిమాండ్  పట్టణ మార్కెట్లను అధిగమించిందని కూడా పేర్కొంది.