ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఖానాపూర్‌లో బైక్ రైడర్స్కోసం కొత్తగా రైడింగ్ ట్రాక్ ఏర్పాటైంది. రేవ్ ల్యాండ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రాక్‌ను స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శనివారం ప్రారంభించారు. బైక్ రైడింగ్ చేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరమని, వారాంతాల్లో ఎంజాయ్ చేయడానికి అనువుగా ఉంటుందన్నారు.
రేవ్ ల్యాండ్ యజమానులు వనపల్లి మాధురి, నారెడ్డి యశోధన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారిగా 1.8 కిలోమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేశామని, ఇందులో వివిధ స్థాయిల్లో రైడింగ్ నేర్పించే వీలు ఉందన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, 100 మందికి పైగా రైడర్లు పాల్గొన్నారు.
