మాదాపూర్ లో రేవ్ పార్టీ.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్..

మాదాపూర్ లో  రేవ్ పార్టీ.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్..

హైదరాబాద్  మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్ లో  యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడుల చేసి పార్టీని భగ్నం చేశారు.  భారీగా కొకైన్, ఎల్ఎస్ డీ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న ఐదుగురుని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు.

 అరెస్ట్ అయిన వారిలో  సినీ నిర్మాత వెంకట్ తో పాటు పలువురు  ప్రముఖులు,  సినీ పరిశ్రమకు  చెందిన పలువురు యువతులు ఉన్నారు.  అరెస్ట్ చేసిన వారందరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు నార్కోటికి బ్యూరో అధికారులు.