గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ లో..స్టూడెంట్స్ రేవ్ పార్టీ..అమ్మాయిలే ఎక్కువ మంది..!

 గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ లో..స్టూడెంట్స్ రేవ్ పార్టీ..అమ్మాయిలే ఎక్కువ మంది..!

నోయిడా: చదువుకొని ఉన్నతస్థాయికి వెళ్లాల్సిన విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్నారు. క్లబ్ పార్టీలు, రేవ్ పార్టీలు అంటూ భవిష్యత్తును మద్యం, డ్రగ్స్ మత్తులో ముంచేస్తున్నారు.గంజాయి, డ్రగ్స్ కు బానిసలవుతూ బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా..పోలీసులు , ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా క్లబ్బులు, రేవ్ పార్టీల్లో డ్రగ్స్ సంస్కృతి మారడం లేదు. తాజాగా నోయిడాలో ఏకంగా గేెటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ లో కాలేజీ బిల్డింగ్ లోనే రేవ్ పార్టీ చేసుకున్నారు విద్యార్థులు.. మత్తులో మునిగే తేలారు.. వివరాల్లోకి వెళితే.. 

నోయిడాలోని సూపర్ టెక్ సుపర్ నోవాలో రేవ్ పార్టీని ఛేదించారు యూపీ పోలీసులు. రేవ్ పార్టీలో పాల్గొన్న 35 మంది కాలేజీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో మద్యం, డ్రగ్స్ తీసుకున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. సూపర్ నోవా సొసైటీ నివాసితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటికి వచ్చింది. డ్రగ్స్ తో పార్టీ స్థానికంగా కలకలం రేపింది. 

పార్టీ జరుగుతున్నప్పుడు ఫ్లాట్ నుంచి మద్యం బాటిల్స్ విసిరివేయడంతో సూపర్ టెక్ సూపర్ నోవా నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రేవ్ పార్టీ బాగోతం బయటికి వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 35 మంది కాలేజీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పార్టీకోసం ఎంట్రీ ఫీజ్ వసూలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. సింగిల్స్ కి రూ. 500లు, జంటలకు రూ.800 వందలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వాట్సాప్ మేసేజ్ ద్వారా సమాచారం పంపిస్తున్నట్లు గుర్తించారు. 

ఐదుగురు నిర్వాహకులతో సహా 35 మంది విద్యార్థులపై కేసు నోమదు చేశారు నోయిడా పోలీసులు. ఘటన స్థలం నుంచి హుక్కా, ఖరీదైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.