గ్రేటర్​ నోయిడా అపార్ట్​మెంట్​లో రేవ్​ పార్టీ

గ్రేటర్​ నోయిడా అపార్ట్​మెంట్​లో రేవ్​ పార్టీ

నోయిడా: ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో కొందరు యూనివర్సిటీ స్టూడెంట్లు శుక్రవారం రాత్రి ఓ అపార్ట్​మెంట్​లో రేవ్​పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు నోయిడా సెక్టార్-39లోని సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోవా రెసిడెన్షియల్ సొసైటీ వద్దకు చేరుకున్నారు. అపార్ట్​మెంట్​పై దాడి చేసి 39 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు ఓ పోలీసు అధికారి శనివారం మీడియాకు తెలిపారు. 

వీరిలో కొంతమంది విద్యార్థుల వయస్సు 16 నుంచి 20 ఏండ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అలాగే, పార్టీలో పెద్ద సంఖ్యలో హర్యానా లేబుల్ లిక్కర్ సీసాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ పార్టీ కోసం వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులను ఆహ్వానించినట్టు పోలీసుల విచారణలో తేలింది.