నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే :రవికిషన్

నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే :రవికిషన్

తాను ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నానని నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ అన్నారు. ఇండస్టీలోకి వచ్చిన కొత్తలో ఓ మహిళ కాఫీ కోసం రాత్రి వేళ రావాలని పరోక్షంగా కోరిందని అయితే తనకు విషయం అర్థం కావడంతో తప్పించుకోగలిగానని రవికిషన్ వెల్లడించారు. ఆమె పేరు ఇప్పుడు బయట పెట్టలేనని, ప్రస్తుతం ఆమె పెద్ద స్థాయిలో ఉన్నారని రవికిషన్ వెల్లడించారు. 

ఇక హీరోయిన్ నగ్మాతో  రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వచ్చిన వార్తలపై కూడా రవికిషన్  స్పందించారు. వరుస సినిమాల్లో కలిసి నటిస్తే ఇలాంటి వార్తలు రావడం కామన్ అన్నారు. తమ ఇద్దరి మధ్య  మంచి అనుబంధం ఉందని తామిద్దరం  కలిసి సినిమాలు చేసేటప్పటికే తనకు వివాహమైందని రవికిషన్ చెప్పుకొచ్చారు.

భోజ్‌పురిలో సీనియర్ నటుడైన రవికిషన్ హిందీ,తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించారు. తెలుగులో ఆయన నటించిన రేసుగుర్రం, కిక్ 2, రాధ, సుప్రీమ్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.