IPLలో ఆడితేనే ధోనికి ఛాన్స్

IPLలో ఆడితేనే ధోనికి ఛాన్స్

ధోనీ క్రికెట్ కెరీర్ పై టీమిండియా కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ తర్వాత ధోని క్రికెట్ భవిష్యత్తుపై క్లారిటీ వస్తుందన్నారు. ధోని టీమిండియాకు భారం కాదన్నారు. ఇప్పటికే టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని త్వరలోనే వన్డే క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్తాడన్నారు. ఇక కేవలం టీ20ల్లో మాత్రమే అతను ఆడే ఛాన్స్ ఉంటుందన్నారు.  ఐపీఎల్ లో ధోని రాణిస్తేనే  టీ20 వరల్డ్ కప్ లో  ఆడతాడాన్నారు. ధోని ఖచ్చితంగా ఐపీఎల్ లో రాణిస్తాడనే నమ్మకం తనకుందన్నారు.