Ravindra Jadeja: ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతిలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై మ్యాచ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ CSKకి వెళ్లగా, జడేజా RRలోకి మారిన సంగతి తెలిసిందే. సంజూ బ్యాటింగ్‌లో విఫలమై అభిమానులను నిరాశపరచగా, జడేజా మాత్రం బంతితో చెలరేగి గౌహతి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. రాజస్థాన్‌లోకి తిరిగి చేరిన రవీంద్ర జడేజా, తన మాజీ ఫ్రాంచైజీ చెన్నైపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు.
జడేజా సెలబ్రేషన్!
తన మొదటి ఓవర్లోనే జడేజా రెండు వికెట్లు పడగొట్టి CSK జట్టు నడ్డి విరిచాడు. ముఖ్యంగా శివమ్ దూబే వికెట్ తీసిన తర్వాత జడేజా చేసిన సంజ్ఞ (Gesture) సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2012 నుంచి (రెండేళ్ల నిషేధం మినహా) 2025 వరకు చెన్నై జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న జడ్డూ, ఇప్పుడు అదే జట్టుపై 2 వికెట్లు తీసి ఘనంగా సంబరాలు చేసుకోవడం గమనార్హం. అయితే తన తొలి ఓవర్ వేసేందుకు రాగా సర్ఫరాజ్ ఖాన్ ని ఔట్ చేసిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన దూబే భారీ సిక్సర్ కొట్టాడు.. ఆ తర్వాత బాల్ ని డాట్ చేయగా మరో బంతిని బలంగా కొట్టబోయి అవుట్ అయ్యాడు. శివమ్ ఔట్ అయినా తర్వా సర్ జడేజా గన్ ఫైర్ సెలబ్రేషన్స్ చేశాడు..ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కాగా రవీంద్ర జడేజా కెరీర్ ప్రారంభంలో (2008– -2011) రాజస్థాన్ రాయల్స్ తరపునే ఆడాడు. 2008లో ఛాంపియన్లుగా నిలిచిన జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత సుమారు 2 మిలియన్ డాలర్లకు మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లాడు. ఇప్పుడు మళ్లీ తన సొంత గూటికి చేరి, మొదటి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు.
A special return in Pink for Ravindra Jadeja 🩷
— IndianPremierLeague (@IPL) March 30, 2026
🎥 Two quick wickets in his very first over back for the Royals 🔥
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @rajasthanroyals | @imjadeja pic.twitter.com/leq4EyMRha
