రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్

రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్

ఆసియా కప్ లో మంచి జోష్ మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్న రవీంద్ర జడేజాకు గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. పాక్ పై జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించడంలో జడేజా కీలక రోల్ పోషించారు. తాజాగా కుడి మోకాలికి గాయంతో బాధ పడుతున్నాడు. బీసీసీఐ వైద్య బృందం పరీక్షలు జరిపింది. టోర్నీకి దూరంగా ఉండాలని సూచించడంతో అతని ప్లేస్ లో అక్షర్ పటేల్ ను తీసుకోవాలని ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జడేజా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఆసియాకప్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా..సూపర్ -4కు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా తొలుత చిరకాల ప్రత్యర్థి పాక్ను ఓడగొట్టింది. ఆ తర్వాత హంకాంగ్ను చిత్తు చేసి..సూపర్ 4కు క్వాలిఫై అయింది. గ్రూప్-ఏలో పాకిస్తాన్.. హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు రెండు జట్లు ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. ఇందులో గెలిచిన జట్టు సూపర్ 4లో భారత్‌ను ఢీ కొడుతుంది.

ఆసియా కప్ భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి చంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్హదీప్ సింగ్, ఆవేష్ ఖాన్.