జ్యోతినగర్, వెలుగు: ఎన్టీపీసీ రామగుండం వేదికగా నాలుగు రోజులుగా సాగిన దక్షిణ క్షేత్ర క్రీడా సమ్మేళనం (ఎస్ ఆర్ ఎస్ ఎం )2025– -26 గురువారం ముగిసింది. వివిధ విభాగాల క్రీడాకారులు తమ నైపుణ్యంతో స్ఫూర్తిని రగిలించారు. స్థానిక టౌన్ షిప్ లోని ఎంజీ స్టేడియంలో జరిగిన ఈ క్రీడా ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)చందన్ కుమార్ సామంత హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు.
వాలీబాల్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్ వంటి వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పతకాలు, ట్రోఫీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఉన్నతాధికారులు, క్రీడా విభాగం ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
