- హాజరుకానున్న పీసీసీ ప్రెసిడెంట్, మంత్రులు వివేక్, జూపల్లి, ఎంపీ వంశీకృష్ణ
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కాంగ్రెస్సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పీసీసీ ప్రెసిడెంట్మహేశ్గౌడ్, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్, బొజ్జుపటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావధ్ తదితరులు హాజరుకున్నారు.
కార్యక్రమాన్ని సక్సెస్చేయాలి
క్యాతనపల్లి ఎంఎన్ఆర్గార్డెన్స్లో నిర్వహించనున్న సమావేశ ఏర్పాట్లను గురువారం డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, స్థానిక కాంగ్రెస్లీడర్లు పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు రఘునాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చెప్పారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం, కార్యకర్తల్లో సమన్వయం పెంచడం, ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను ఎంపిక, కార్యకర్తలకు మార్గదర్శనం చేయడం, సభ్యత్వ నమోదు, ప్రజలతో అనుసంధానం పెంపొందించడం వంటి అంశాలపై నేతలు దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు.
