మా కుటుంబంలో ఎటువంటి గందరగోళం లేదు : రివాబా జడేజా

మా కుటుంబంలో ఎటువంటి గందరగోళం లేదు : రివాబా జడేజా

తమ కుటుంబంలో వేర్వేరు సిద్ధాంతాలు ఉండడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తెలిపారు. ఒకే కుటుంబంలో విభిన్న భావజాలం ఉన్నవారు ఉండొచ్చని తెలిపారు. జడేజా, తనది ఒకటే భావజాలం అని రివాబా చెప్పారు. తమ కుటుంబంలో ఎటువంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. జడేజా తండ్రి కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం ఆయన వ్యక్తిగత విషయమన్నారు.

నార్త్ జామ్నగర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన రివాబా రాజ్ కోట్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జామ్ నగర్ ప్రజలపై తనకు నమ్మకం ఉందని..ఈ సారి కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ రాజకీయ నేత హరిసింగ్ సోలంకికి దగ్గర బంధువైన రివాబా..2016లో జడేజాను పెళ్లి చేసుకుంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. తొలిదశలో 19 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది. దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ సతీ సమేతంగా నవ్సారీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. 

తొలి విడతలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్​తో పాటు మొత్తం 36 పార్టీలు అభ్యర్థుల్ని బరిలోకి నిలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ 89స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్​ 88 మంది అభ్యర్థుల్ని బరిలో దింపింది. ఇక బీఎస్పీ 57, భారతీయ ట్రైబల్​పార్టీ 14, సీపీఎం 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. 339 మంది ఇండిపెండెంట్లుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 788 మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళలున్నారు. వీరిలో బీజేపీ నుంచి 9 మంది, కాంగ్రెస్​ నుంచి 6, ఆప్​ నుంచి ఐదుగురు పోటీలో ఉన్నారు.