‘సామజవరగమన’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా జాన్.. ఆ తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలోని ‘స్వాతి రెడ్డి’ పాటతో అలరించింది. తాజాగా మరోసారి శ్రీవిష్ణుకి జోడీగా కనిపిస్తోంది. వీరిద్దరూ జంటగా నటించిన ‘మృత్యుంజయ్’ చిత్రంలోని తన పాత్రను పరిచయం చేస్తూ శనివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఐపీఎస్ సీతా పరశురామ్‌గా రెబా మెనికా జాన్ కనిపించనుందని రివీల్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె ఆకట్టుకుంటోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా, రమ్య గున్నం సమర్పణలో సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 27న వరల్డ్ వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఇంటరెస్టింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని దర్శక నిర్మాతలు అన్నారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
