మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ

మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • కొత్తగా 404 దుకాణాలు.. 2620కి పెరగనున్న మద్యం దుకాణాలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాలకు రేపు మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. వచ్చే డిసెంబర్ నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 404 కొత్త దుకాణాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. అదనంగా 404 దుకాణాలు ప్రారంభించనుండడంతో రాష్ట్రంలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 2,620కి పెరగనుంది. దుకాణాలను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించనుంది. గౌడ్ లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలను ప్రభుత్వం కేటాయించగా.. 1864 దుకాణాలు ఓపెన్ కేటగిరి కింద కేటాయించనున్నారు. ఈనెల 20వ తేదీన డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతుంది.