21 నుంచి రెడ్‌‌మి నోట్‌‌ 8.. ఆఫర్లు ఇవే!

21 నుంచి రెడ్‌‌మి నోట్‌‌ 8.. ఆఫర్లు ఇవే!

చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి ఈమధ్యే విడుదలైన ‘రెడ్‌‌ మి నోట్‌‌ 8, రెడ్‌‌ మి నోట్‌‌ 8 ప్రొ’ ఫోన్లు ఈ నెల 21 నుంచి ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులోకి రానున్నాయి. ‘రెడ్‌‌ మి నోట్‌‌ 8’ 6జీబీ/64జీబీ ధర రూ.9,999 కాగా, 6జీబీ/128జీబీ ధర రూ.12,999గా ఉంది. ‘రెడ్‌‌ మి నోట్‌‌ 8 ప్రొ’ 6జీబీ/64జీబీ ధర రూ.14,999, 6జీబీ/128జీబీ ధర రూ.15,999, 8జీబీ/128జీబీ ధర రూ.17,999గా ఉంది. ఈ ఫోన్స్‌‌ నాలుగు రేర్‌‌‌‌ కెమెరా సెటప్‌‌ కలిగి ఉండటం విశేషం. హీలియో జి90టి చిప్‌‌సెట్‌‌తో, 64 ఎంపీ కెమెరాతో రూపొందిన తొలి ఫోన్‌‌ ‘రెడ్‌‌ మి నోట్‌‌ 8 ప్రొ’ అని కంపెనీ ప్రకటించింది.

ఇది 20 ఎంపీ సెల్ఫీ షూట్‌‌ కెమెరా కలిగి ఉంది. మెయిన్‌‌ కెమెరా 120 డిగ్రీ ఫీల్డ్‌‌ వ్యూతో ఫొటోలు, వీడియోలు క్యాప్చర్‌‌‌‌ చేస్తుంది. 6.5 అంగుళాల డాట్‌‌ నాచ్‌‌ డిస్ప్లే, 4,500 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ కలిగి ఉంది. రెడ్‌‌ మి నోట్‌‌ 8 మాత్రం 48 ఎంపీ రేర్‌‌‌‌ కెమెరాతోపాటు 8ఎంపీ అల్ట్రావైడ్‌‌, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్‌‌ సెన్సర్‌‌‌‌ కెమెరా కలిగి ఉంది. ఇది 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. ఎంఐ సంస్థ ఎయిర్‌‌‌‌ ప్యూరిఫైర్‌‌‌‌ కూడా విడుదల చేసింది. దీని ధర రూ.6,499. షావోమీ సంస్థ ‘ఎంవూయూఐ’ యూజర్ల కోసం మింట్‌‌ కీబోర్డ్‌‌ను ప్రకటించింది. ఇది 25 లాంగ్వేజిల్ని సపోర్ట్‌‌ చేస్తుంది.