సిటీలో తగ్గిన క్రైమ్‌‌ రేట్‌‌

సిటీలో తగ్గిన క్రైమ్‌‌ రేట్‌‌

హైదరాబాద్,వెలుగు : గతేడాదితో పోల్చితే ఈసారి సిటీలో క్రైమ్‌‌ రేట్‌‌ తగ్గింది. ఆరు నెలల్లో 10 శాతం కేసులు తగ్గాయి. రెండు నెలలకుపైగా లాక్‌‌డౌన్‌‌ ఉండగా కేసులు తక్కువగా రిపోర్ట్‌‌ అయ్యాయి. ఫస్ట్‌‌ హాఫ్‌‌ ఇయర్‌‌‌‌ క్రైమ్ రేట్‌‌ వివరాలను బుధవారం సిటీ సీపీ అంజనీకుమార్‌‌‌‌ వెల్లడించారు. లాక్‌‌డౌన్‌‌ డ్యూటీలతో పాటు క్రైమ్‌‌ రేట్‌‌ తగ్గించేందుకు కృషి చేశామని చెప్పారు. అయితే సైబర్‌‌‌‌ క్రైమ్ ఏటేటా పెరిగిపోతోందని జనాలు అలర్ట్‌‌గా ఉండాలని హెచ్చరించారు.

 ఆరు నెలల్లో 12,273  కేసులు

సిటీ కమిషనరేట్‌‌ పరిధిలోని ఐదు జోన్లలో క్రైమ్‌‌ కంట్రోల్‌‌ కు లా అండ్ ఆర్డర్‌‌ పకడ్బందీగా అమలు చేశారు.  మార్చి 22 నుంచి లాక్‌‌డౌన్‌‌ అమల్లోకి రాగా,  ఫ్రంట్‌‌ లైన్‌‌ వారియర్స్‌‌గా ఉంటూనే కేసుల  ఇన్వెస్టిగేషన్‌‌ చేయగా కరోనా కారణంగా కొన్ని కేసులు  లేట్‌‌ అయ్యాయి. గతేడాది జనవరి నుంచి జూన్‌‌ వరకు ఆరునెలల కాలంలో 12,374 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 12,273 రిపోర్ట్‌‌ అయ్యాయి. లాక్‌‌డౌన్‌‌ కారణంగా 101 కేసులు మాత్రమే వచ్చాయి. ప్రాపర్టీ అఫెన్స్‌‌ల్లో 56 శాతం కేసులను డిటెక్ట్‌‌ చేయగా, ఇందులో 1068 కేసుల్లో 590 కేసులను ఛేదించారు.  34 మంది నేరస్తులపై పీడీ యాక్ట్‌‌ పెట్టారు. కోర్టు విచారణలోని 1,307 కేసుల్లో 450 మందికి  శిక్షలు విధించేలా ఎవిడెన్స్‌‌ ప్రొడ్యూస్‌‌ చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి 26 శాతం శిక్షల రేట్‌‌ పెరిగింది. లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ రూల్స్‌‌ బ్రేక్‌‌ చేస్తున్న 145 మందిపై  రౌడీ షీట్స్‌‌ ఓపెన్‌‌ చేశారు. అత్యధికంగా సౌత్‌‌ జోన్‌‌లో కొత్తగా 50 రౌడీ షీట్స్‌‌ తెరిచారు.

రెండు కమిషనరేట్లలో 1,818 సైబర్‌‌ కేసులు

సైబర్‌‌‌‌ క్రైమ్ కేసుల సంఖ్య ఏటేటా పెరుగు తోంది. గతేడాది ఆరునెలల్లో  మొ త్తం1,393 నమోదైతే, ఈసారి సిటీ కమిషనరేట్‌‌ పరిధిలో 1,210 కేసులు రిజిస్టర్‌‌‌‌ అయ్యాయి. వీటిలో 334 ఓఎల్‌‌ఎక్స్‌‌, 367 డెబిట్‌‌, క్రెడిట్‌‌ కార్డ్ డేటా హ్యాక్ అయినవి ఉన్నాయి. సైబర్‌‌‌‌ క్రిమినల్స్‌‌ రూ.28 కోట్లు దోచేశారు. సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో 608 సైబర్ నేరాలు రిపోర్ట్‌‌ అయ్యాయి. సుమారు రూ.10.5 కోట్లు సైబర్‌‌‌‌ దొంగలు కొల్లగొట్టారు.