అదరగొట్టిన రిలయన్స్: రెండోసారి 10 వేల కోట్ల లాభం

అదరగొట్టిన రిలయన్స్: రెండోసారి 10 వేల కోట్ల లాభం

విశ్లేషకుల అంచనాలను మరోసారి రిలయన్స్‌‌‌‌ తలకిందులు చేసింది. రిలయన్స్‌‌‌‌ లాభాలు తగ్గుతాయన్న వారి అంచనాలకు భిన్నంగా రిలయన్స్ అద్భుతమైన ఫలితాలను ప్రకటించడం విశేషం.వరసగా మరో క్వార్టర్‌‌‌‌లో రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌ రూ.10 వేల కోట్లకు పైన నికరలాభం ఆర్జించింది. మార్చి 2019తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో రిలయన్స్ఇండస్ట్రీస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ నికరలాభం 9.8 శాతం పెరిగి రూ. 10,362 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది చివరి క్వార్టర్లో రిలయన్స్‌‌‌‌కు రూ. 9,438 కోట్ల నికరలాభం వచ్చింది. మార్చి 2019 తో ముగిసిన క్వార్టర్లో కంపెనీ అమ్మకాలు కూడా 19.4 శాతం పెరిగి రూ. 1.54 లక్షల కోట్లకు చేరాయి. బ్లూ మ్‌ బర్గ్‌‌‌‌ పోల్‌‌‌‌లో 14 మంది విశ్లేషకులు కంపెనీ లాభం రూ.9,796 కోట్ల దాకా ఉంటుం దని అంచనా వేశారు. ఐతే, 12 మంది ఎనలిస్టులు అమ్మకాలు రూ.1.48 లక్షల కోట్లకు చేరతాయని చెప్పారు.

రిటైల్‌ లో లక్ష కోట్ల మార్కు…

2018–19 ఆర్ధిక సంవత్సరంలో అనేక మైలురాళ్లను అందుకున్నామని ఛైర్మన్‌‌‌‌ ముఖేష్‌ అంబానీ తెలిపారు. రిలయన్స్‌‌‌‌ రిటెయిల్‌‌‌‌ రూ. లక్ష కోట్ల మార్కును అధిగమించింది. జియో 30 కోట్ల కస్టమర్లను సంపాదిం చింది. ఇక పెట్రోకెమికల్స్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ మునుపెన్నడూ లేని అమ్మకాలను సాధించిందని అంబానీ పేర్కొన్నారు . ఈ విజయాలన్నీ రిలయన్స్‌‌‌‌ ఉద్యోగుల ఘనతేనని కొనియాడారు. భవిష్యత్‌ లోమరిన్ని విజయాలకు పునాదిపడిందని చెప్పారు.2018–19 ఆర్ధిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్‌‌‌‌ నికరలాభం రికార్డు స్థాయిలో రూ. 39,588 కోట్లకు చేరిందని రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌ వెల్లడించింది. ఇంధన మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులున్నా మెరుగైన ఫలితాలను సాధించినట్లు పేర్కొంది. గత అయిదేళ్లలో కంపెనీ పీబీడీఐటీ రెట్టింపై రూ. 92,656 కోట్లకు చేరడం ఆనందం కలిగిస్తోందని ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు . వ్యాల్యూక్రియేషన్‌‌‌‌ (విలువ సృష్టి)లో కొత్త బెంచ్‌ మార్క్‌‌‌‌ అందుకోగలిగామని వ్యాఖ్యానించారు.రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌ గ్రాస్‌‌‌‌ రిఫైనింగ్‌‌‌‌ మార్జిన్ ఈ ఏడాది బ్యారెల్‌‌‌‌కు రూ. 569 కి చేరాయి. క్రూడ్‌‌‌‌ను ఫ్యూయెల్‌‌‌‌గా మార్చినందుకు లభించే మార్జిన్‌‌‌‌నే గ్రాస్‌‌‌‌ రిఫైనింగ్‌‌‌‌ మార్జిన్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు .

కస్టమర్‌‌‌‌ ఫోకస్సే కారణం…

సర్వీస్‌‌‌‌, కస్టమర్‌‌‌‌ల సంతృప్తిల మీద ఫోకస్‌‌‌‌ వల్లే కన్స్యూమర్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లలో కస్టమర్లు పెరిగారని, పర్యవసానంగానే అమ్మకా లలో వృద్ధి సాధ్యమైందని ముఖేష్‌ అంబానీ తెలిపారు. ఆర్‌‌‌‌ఐఎల్‌‌‌‌ కన్స్యూమర్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లు మార్చి 2019 క్వార్టర్లో రూ.1,721 కోట్ల ఈబీఐటీడీఏ ఆర్జించింది. జియో లాభదాయకత తాజా క్వార్టర్లో పెరుగుతుందని ఎనలిస్టులు భావించారు . జియో ఫోన్‌‌‌‌ల అమ్మకాలు, సబ్‌ స్కైబర్ల సంఖ్యతోపాటు, లాభదాయకత మెరుగవుతుందని ఆశించారు . రిలయన్స్‌‌‌‌ జియో ఏవరేజ్‌‌‌‌ రెవెన్యూ పర్‌‌‌‌ యూజర్‌‌‌‌ (ఏఆర్‌‌‌‌పీయూ) మార్చి 2019 క్వార్టర్లో స్వల్పంగా తగ్గింది. దాంతో, మార్చి 2019తో ముగిసిన పూర్తి ఏడాదికి రిలయన్స్‌‌‌‌ జియో నికరలాభం రూ.2,964 కోట్లకు పరిమితమైంది. మార్చి 2019 తో అంతమైన క్వార్టర్‌‌‌‌కు, రిటైల్‌‌‌‌ విభాగంలో, ఆర్‌‌‌‌ఐఎల్‌‌‌‌ అమ్మకా లు 51.6 శాతం పెరిగి రూ. 36,663 కోట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది చివరి క్వార్టర్లో ఈ అమ్మకాలు రూ. 24,183 కోట్లు మాత్రమే.