కలెక్టరేట్ లో బ్యాంకు పెట్టారు.. ఏటీఎం సెంటర్ మరిచారు

కలెక్టరేట్ లో బ్యాంకు పెట్టారు.. ఏటీఎం సెంటర్ మరిచారు
  •       ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు

వికారాబాద్, వెలుగు : జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో  ఏటీఎం సెంటర్ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ లో  అన్ని ప్రభుత్వ ఆఫీసులతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ని కూడా ఏర్పాటు చేశారు.  అధికారులు ఏటీఎం సెంటర్ కోసం షెట్టర్ ను కేటాయించారు. కానీ అందులో  ఏటీఎం ఏర్పాటు చేయకుండా వదిలేశారు.

ఏటీఎం మెషీన్  లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం  వచ్చే ప్రజలు ఎమర్జెన్సీగా డబ్బులు కావాలంటే వికారాబాద్ టౌన్ కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అధికారులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.