ముంబై: ఫార్మా కంపెనీ సిప్లా ప్రమోటర్లు షిరిన్ హమీద్, సమీనా హమీద్, రుమానా హమీద్ ఓకాసా ఫార్మా ప్రైవేట్ కంపెనీలో తమ వాటాలో 2.53శాతం విక్రయించాలని చూస్తున్నాయి. ప్రమోటర్లు 20.45 మిలియన్ల షేర్లను విక్రయించడానికి సిద్ధమవుతున్నారు. మొత్తం డీల్ విలువ సుమారు రూ.2,637 కోట్లని ( 316 మిలియన్ డాలర్ల) అంచనా. ఎన్ఎస్ఈలో మంగళవారం సిప్లా షేరు ముగింపు ధర రూ.1,357.35తో పోలిస్తే 0–-5శాతం తగ్గింపుతో...అంటే ఒక్కో షేరుకు రూ.1,289.50 నుంచి రూ.1,357.35 ధర పరిధిలో షేర్లను అందిస్తారు. కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ విక్రయ ప్రక్రియను నిర్వహిస్తోంది. ప్రస్తుతం, ప్రమోటర్లకు సిప్లాలో 4.26శాతం ఉమ్మడి వాటా ఉంది. 2024లో ఇప్పటివరకు సిప్లా స్టాక్ ధర 45శాతం పెరిగింది.
