- పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం అభినందనీయం: మంత్రి సీతక్క
- నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు
- పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజనకు ప్రత్యేక అభినందనలు
- విమర్శలకు తావులేకుండా ఎన్నికలు పూర్తి చేశారంటూ కితాబు
హైదరాబాద్, వెలుగు: గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాం తంగా ముగియడం అభినందనీయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనకు మంత్రి ఫోన్ చేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు, సిబ్బందిని సమర్థంగా సమన్వయం చేస్తూ, ఎక్కడా ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా, విమర్శలు, ఆరోపణలకు తావులేకుండా ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశారని ప్రశంసించారు.
ఎన్నికల నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, పారదర్శకత, నిబద్ధతతో పనిచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా, నూత నంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు శుభా కాంక్షలు తెలిపారు. సజావుగా ఎన్నికలు నిర్వహిం చిన పంచాయతీ రాజ్ సిబ్బందికి, సహకారం అందిం చిన పోలీస్, ఇతర శాఖల అధికారులకు కృత జ్ఞతలు తెలియజేశారు. గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయా లని పిలుపునిచ్చారు.
హింసాత్మక ఘటనలు జరగ కుండా, రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు పూర్తవడం సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. తాగు నీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, మౌలిక వసతులు వంటి అం శాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాసేవకు అంకితం కావాలని గ్రామీణ పాలకవర్గాలను కోరారు. ప్రజల భాగస్వామ్యంతో బలమైన గ్రామపంచాయ తీలను నిర్మిద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
