Reliance: ఆపరేషన్ సిందూర్ పై వెనక్కితగ్గిన రిలయన్స్.. ఏమైందంటే..

Reliance: ఆపరేషన్ సిందూర్ పై వెనక్కితగ్గిన రిలయన్స్.. ఏమైందంటే..

Reliance on Operation Sindoor: ఒకపక్క ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా కొన్ని సంస్థలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎంటర్ టైన్మెంట్ రంగంలోని సంస్థలు ఆపరేషన్ సిందూర్ పేరును దక్కించుకోవటం కోసం తహతహలాడుతున్నట్లు వెల్లడైంది.

ఇక వివరాల్లోకి వెళితే ఆపరేషన్ సిందూర్ పేరును ట్రేడ్ మార్క్ చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి చేసిన దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. కంపెనీలోని ఒక జూనియన్ ఉద్యోగి దీనికి కారణంగా కంపెనీ అందులో వెల్లడించింది. వాస్తవానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పేరును రిజిస్టర్ చేసుకునేందుకు ఇప్పటి వరకు నాలుగు సంస్థలు పోటీ పడుతున్నట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ ఇచ్చిన సమాచారం చెబుతోంది. 

 

అయితే ప్రధానంగా ఓటీటీ, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన కంపెనీలు పేరును దక్కించుకోవటం కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అంటే రానున్న కాలంలో ఈ పేరుపై ప్రస్తుత యుద్ధవాతావణానికి సంబంధించి డాక్యుమెంటరీ, ఓటీటీ సిరీస్ లేదా సినిమాను రూపొందించటానికి వారు పేరును వినియోగించుకోవచ్చని వెల్లడైంది. 

తాజాగా దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందిస్తూ తాము పేరును ట్రేడ్ మార్కింగ్ చేసుకోవాలని అనుకోవటం లేదని, ఇది భారత పరాక్రమణకు చిహ్నంగా తాము భావిస్తున్నట్లు రిలయన్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో జియో స్టూడియోస్ నుంచి చేయబడిన దరఖాస్తును తాము వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. భారత ప్రభుత్వం పహల్గామ్ టూరిస్టులపై పాకిస్థాన్ లోని ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించటంతో ప్రస్తుతం ఈ పదం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యా్న్ని సంతరించుకుంది.