ఆధ్యాత్మిక  టూరిజంతో  ఉపాధి అవకాశాలు

ఆధ్యాత్మిక  టూరిజంతో  ఉపాధి అవకాశాలు

ఆధ్యాత్మిక  టూరిజంతో  ఉపాధి అవకాశాలు  పెరుగుతాయన్నారు  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ. గుజరాత్ లోని  సోమనాథ్ లో అభివృద్ధి  పనులకు వీడియో కాన్ఫరెన్స్  ద్వారా శంకుస్థాపన చేశారు మోడీ.  సోమనాథ్   టెంపుల్ ట్రస్ట్  చైర్మన్ గా  ఉండడం  తన అదృష్టమన్నారు. సోమనాథ్ రూపు రేఖలు ఎలా మారుతున్నాయో  అందరూ చూస్తున్నారని  చెప్పారు. ఆధ్యాత్మిక  పర్యాటకం ద్వారా  భవిష్యత్ తరాలు  సంప్రదాయాలతో  కనెక్ట్ అయి ఉంటాయన్నారు. మన చరిత్ర,  వారసత్వం  ఆధారంగా  న్యూ ఇండియాను  క్రియేట్ చేయాలని  చెప్పారు. న్యూ ఇండియాలో అయోధ్య  రామ మందిరం బలమైన పిల్లర్ గా  ఉంటుందని  చెప్పారు మోడీ.