V6 News

ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి : రాజ్యసభసభ్యురాలు రేణుకాచౌదరి

ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి : రాజ్యసభసభ్యురాలు రేణుకాచౌదరి
  • సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం : రాజ్యసభసభ్యురాలు రేణుకాచౌదరి

భద్రాచలం, వెలుగు : ‘ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి, ఇందుకోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తాను’ అని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి స్పష్టం చేశారు. తెలంగాణ ఎంప్లాయీస్‌‌‌‌ జాయింట్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి పునరేకీరణ పేరుతో సోమవారం భద్రాచలంలో జరిగిన అఖిలపక్ష సభలో ఆమె మాట్లాడారు.

భద్రాచలం సమస్యను 2013లోనే పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లో ప్రస్తావించానని గుర్తుచేశారు. ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడే తొలి అడుగు వేయాలని కోరారు. రాముని ఆస్తులు, ఆదాయం మొత్తం ఏపీలోనే ఉన్నందున సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఐదు గ్రామాలను ఏపీలో కలపడం వల్ల స్థానికత సమస్యతో స్టూడెంట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదు పంచాయతీలు సాధించేందుకు ప్రమాణం చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రాచల రామాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. భద్రాచలం భవిష్యత్‌‌‌‌ కోసం చేస్తున్న పోరాటంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాకేశ్‌‌‌‌రెడ్డి, తెలంగాణ ఎంప్లాయీస్‌‌‌‌ యూనియన్‌‌‌‌ జేఏసీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, చల్లగుల్ల నాగేశ్వరరావు, సర్పంచ్‌‌‌‌ పూనెం కృష్ణ దొర పాల్గొన్నారు.