డీటీవో మృతిపై విచారణ వేగవంతం..రేపు (జూన్ 26) ప్రభుత్వానికి నివేదిక

డీటీవో మృతిపై విచారణ వేగవంతం..రేపు (జూన్ 26) ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్, వెలుగు: డీటీవో వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై రవాణా శాఖ విచారణను వేగవంతం చేసింది. విచారణ అధికారిగా నియమితులైన జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ బుధవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘన్‌‌‌‌పూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు.

ప్రమాదానికి సంబంధించిన ఆధారాల కోసం స్పాట్‌‌‌‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బొగ్గు లారీ వివరాలను సేకరించేందుకు తాడిచెర్ల బొగ్గు లోడింగ్ పాయింట్‌‌‌‌కు వెళ్లారు. అక్కడ ఓపెన్ కాస్ట్ అధికారులతో మాట్లాడి లారీ లోడింగ్, రవాణాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ  ప్రమాదంపై విచారణ గురువారంతో పూర్తి కానుందని రవాణా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు పేర్కొన్నారు.