సరిహద్దు ప్రాంత అభివృద్ధిలో ఎల్‌‌‌‌పీఏఐది కీలకపాత్ర : కేంద్ర మంత్రి బండి సంజయ్

సరిహద్దు ప్రాంత అభివృద్ధిలో ఎల్‌‌‌‌పీఏఐది కీలకపాత్ర : కేంద్ర మంత్రి బండి సంజయ్
  • ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్  సందర్శన

న్యూఢిల్లీ, వెలుగు: దేశ సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడంలో ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్‌‌‌‌పీఏఐ) కీలక పాత్ర పోషిస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్‌‌‌‌లో ఉన్న ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్‌‌‌‌పీఏఐ) హెడ్ ఆఫీస్ ను మంత్రి సందర్శించారు. ఆయనకు ఎల్‌‌‌‌పీఏఐ చైర్మన్ జయంత్ సింగ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బోర్డర్ మేనేజ్​మెంట్, జాయింట్ సెక్రటరీ పసుమి బసు, ఎల్‌‌‌‌పీఏఐ సభ్యురాలు (ఫైనాన్స్) రేఖా రాయ్కర్ కుమారి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలు, గత కొన్నేండ్లలో సాధించిన పురోగతి, అంతర్జాతీయ సరిహద్దుల్లో సమగ్ర చెక్‌‌‌‌పోస్టుల (ఐసీపీలు) అభివృద్ధి, నిర్వహణ వంటి అంశాలను ఎల్‌‌‌‌పీఏఐ చైర్మన్ జయంత్ సింగ్ కేంద్ర మంత్రికి వివరించారు. అంతకుముందు మంత్రి బండి సంజయ్ ఎల్‌‌‌‌పీఏఐ హెడ్ ఆఫీస్ లో ప్రదర్శించిన వివిధ చెక్‌‌‌‌పోస్టుల నమూనాలను పరిశీలించారు. సంస్థ చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. దేశ భద్రత, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్ధికి ఎల్‌‌‌‌పీఏఐ చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.