కోల్‌కతా: బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తారాతలా ప్రాంతంలోని బ్రేస్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ట్రాన్స్‌పోర్ట్ డిపో రోడ్‌లో బుధవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల గోదాం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో 18 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్టు సమాచారం. విషయం తెలిసి సీఎం సువేందు అధికారి స్వయంగా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. శిథిలాల కింద మరో 18 మంది వరకు చిక్కుకొని ఉండవచ్చని, వారిని రక్షించడానికి ఆర్మీతో సహా కేంద్ర, రాష్ట్ర సంస్థలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు.
