ముంబై లోకల్ ట్రైన్ లో మర్డర్ ..డోర్ మూసే విషయంలో తోటి ప్రయాణికుడితో వాగ్వాదం

ముంబై లోకల్ ట్రైన్ లో మర్డర్ ..డోర్ మూసే విషయంలో తోటి ప్రయాణికుడితో వాగ్వాదం
  • ఆగ్రహంతో కత్తి తీసి దాడి చేసిన నిందితుడు

ముంబై: లోకల్ ట్రైన్​లో డోర్ మూసే విషయంపై తలెత్తిన వివాదం ఓ ప్రయాణికుడి ప్రాణం తీసింది. కంపార్ట్​మెంట్​లోని ప్రయాణికులంతా కలిసి తనపై దాడి చేయడంతో ఆగ్రహం చెందిన నిందితుడు.. తన వద్ద ఉన్న కత్తితో మయాంక్ ​లోహర్‌‌‌‌ అనే ప్రయాణికుడిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మయాంక్.. స్పాట్ లోనే మరణించాడు. ముంబై లోకల్ ట్రైన్​లో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి చర్చిగేట్–-నల్లసోపరా ఫాస్ట్ లోకల్ రైలులో మయాంక్ ప్రయాణిస్తున్నాడు. రైలు గోరేగావ్ దాటిన తర్వాత బయట వర్షం మొదలైంది. వర్షం నీళ్లు లోపలికి వస్తున్నాయని మయాంక్ ఆ కంపార్ట్​మెంట్ డోర్ మూసేందుకు ప్రయత్నించాడు. దీనికి మరో ప్రయాణికుడు రోషన్ సువర్ణ అభ్యంతరం చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. మయాంక్ కు సపోర్ట్ గా మరికొంతమంది ప్రయాణికులు మద్దతు పలికారు. అందరూ కలిసి గట్టిగా చెప్పినా రోషన్ వినిపించుకోలేదు. దీంతో మయాంక్ సహా మరికొందరు ప్రయాణికులు రోషన్ పై దాడి చేశారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రోషన్.. తన బ్యాగులో నుంచి కత్తిని తీసి మయాంక్‌‌‌‌పై దాడి చేశాడు. దీంతో మయాంక్​ చనిపోగా, రోషన్ పరారయ్యాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్‌‌‌‌

ఈ ఘోరానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది. బాధితుడిని చంపేసిన తర్వాత నిందితుడు చేతిలో కత్తితో కంపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో నడుచుకుంటూ వెళ్తుండటం ఆ వీడియోలో కనిపించింది. నిందితుడు వెనక్కి తిరిగి రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడి వైపు చూస్తుండటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అయితే, నిందితుడిని అడ్డుకోవడానికి, పట్టుకోవడానికి ఎవరూ సాహసించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌‌‌‌కు చేరుకున్నారు.  మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌‌‌‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న 
నిందితుడిని కుర్లా ప్రాంతంలో అరెస్ట్ చేశారు.