కేటీఆర్, హరీశ్.. రాజకీయాల్లో విలన్లు..పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కేటీఆర్, హరీశ్.. రాజకీయాల్లో విలన్లు..పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో కేటీఆర్, హరీశ్‌‌‌‌ రావు అసలైన విలన్లని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. పదేండ్ల అధికారంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్‌‌‌‌ఎస్ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురదజల్లుతున్నారని అన్నారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే.. గత సర్కార్ దాన్ని సగం కట్టి వదిలేసిందని విమర్శించారు.

తాము నిర్వహించలేమని ఎల్ అండ్ టీ సంస్థ చేతులెత్తేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి మెట్రోను ప్రజల ఆస్తిగా మార్చారని కొనియాడారు. అహ్మదాబాద్, ముంబైకి ఇచ్చినట్లే హైదరాబాద్‌‌‌‌కు నిధులివ్వాలని కేంద్రాన్ని నిలదీసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ ప్రాజెక్టులు కట్టి కృష్ణా నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ పేరు చెప్పి కుర్చీ ఎక్కాలని కేటీఆర్ ఆరాటపడుతున్నారని, అవసరమైతే కేసీఆర్‌‌‌‌ను కూడా పక్కకు నెట్టేసేందుకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌ వెనుకాడరని కామెంట్‌‌‌‌ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ, గాంధీ సరోవర్ వంటి ప్రాజెక్టులు వస్తుంటే బీఆర్‌‌‌‌ఎస్ నేతల కళ్లు  మండుతున్నాయని ఎద్దేవా చేశారు.