వెనెజువెలాలో 30 సెకన్ల వ్యవధిలో బ్యాక్ టూ బ్యాక్ భూకంపాలు.. పదివేల మందికి పైగా చనిపోయి ఉండొచ్చని అంచనా !

వెనెజువెలాలో 30 సెకన్ల వ్యవధిలో బ్యాక్ టూ బ్యాక్ భూకంపాలు.. పదివేల మందికి పైగా చనిపోయి ఉండొచ్చని అంచనా !

కారాకాస్‌: వెనెజువెలా, జపాన్‌ దేశాలను భారీ భూకంపాలు వణికించాయి. నిమిషాల వ్యవధిలో వెనెజువెలాలో రెండు భారీ భూకంపాలు రావడంతో భారీ భవనాలు కుప్పకూలాయి. బుధవారం సాయంత్రం 39 సెకన్ల వ్యవధిలో వెనెజువెలాలో 7.2, 7.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. దీంతో.. వెనెజువెలా రాజధాని కారకాస్‌లోని భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. దాదాపు పది వేల మంది దాకా చనిపోయి ఉండొచ్చని USGS అంచనా వేసింది.

USGS డేటా ప్రకారం.. ఆ రెండు భూకంపాలు ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో, ఒకదానికొకటి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో, వేర్వేరు చోట్ల సంభవించాయి. ఈ ప్రకంపనల వల్ల కారకాస్‌లో భవనాలు కూలిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కూలిన భవనాల కింద వేల మంది చిక్కుకుపోయారు. పొరుగున ఉన్న కొలంబియాలో కూడా ఈ భూకంపాలు ప్రభావం చూపాయి. వెనెజువెలాలో వరుస భూకంపాల తర్వాత హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.

బుధవారం రాత్రి 22.04 GMTకి కారకాస్‌కు పశ్చిమాన సుమారు 284 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫెలిప్ సమీపంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆ వెంటనే రాజధానికి పశ్చిమాన సుమారు 293 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుమారే సమీపంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్‌లోనూ భారీ భూకంపం సంభవించింది. జపాన్‌లో భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం కారణంగా జపాన్‌లో రైలు సర్వీసులు నిలిపివేశారు.