ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ప్రబల తీర్థం ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ శకటం

 

'క్లీన్-గ్రీన్ ఎనర్జీ ఎఫిషియంట్ గుజరాత్' థీమ్ తో ఏర్పాటు చేసిన గుజరాత్ శకటం

 

దియోఘర్‌లో ఉన్న ప్రసిద్ధ బైద్యనాథ్ ఆలయాన్ని  చూపే జార్ఖండ్ శకటం

 

నూతన జమ్మూ- కశ్మీర్‌ ఇతివృత్తంతో శకటం ఏర్పాటు

 

నారీ శక్తిపై కేరళ శకటం

 

ముగ్గురు మహిళా సాధకుల అసాధారణ విజయాలను ప్రతీకాత్మకంగా చూపే కర్ణాటక శకటం

 

మహారాష్ట్ర: సాడేతీన్‌ శక్తిపీఠం, నారీశక్తి

భగవద్గీతను ప్రతిబింబించే హర్యానా శకటం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండగా.. అతనికి గీతా జ్ఞానాన్ని అందిస్తున్నట్లు చూపిస్తుంది. పక్కన ఉన్న నమూనాలు మహాభారత యుద్ధంలోని వివిధ దృశ్యాలను చూపుతున్నాయి.

అయోధ్యలో జరుపుకునే మూడు రోజుల దీపోత్సవాలను చూపే ఉత్తర్ ప్రదేశ్ శకటం

 

ప్రపంచంలోని ఏకైక చురుకైన అశ్వికదళ రెజిమెంట్

 

కవాతు చేస్తున్న కంటెంజెంట్లు

 'టూరిజం అండ్ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ లడఖ్' అనే ఇతివృత్తం ఆధారంగా రూపొందించిన శకటం

అస్సాం శకటం

కార్బెట్ నేషనల్ పార్క్, అల్మోరా జగేశ్వర్ ధామ్ ను వర్ణించే ఉత్తరాఖండ్ శకటం