రాజ్యాంగమే నా సందేశం : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఐ, సీపీఎంకు జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి. సుదర్శన్ రెడ్డి వినతి

రాజ్యాంగమే నా సందేశం : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఐ, సీపీఎంకు జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి. సుదర్శన్ రెడ్డి వినతి
  • రాజ్యాంగ రక్షణకు 52 ఏండ్లుగా పోరాడుతున్నాను: జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి. సుదర్శన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు:  ‘‘నేను 52 ఏండ్లుగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్నాను. రాజ్యాంగమే నా సందేశం. నా గురించి నేను చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు’’అని ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి కిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ సింగ్ సుర్జీత్ భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీపీఎం ప్రధాన కార్యద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శి ఎం.ఎ బేబీ, పొలిట్ బ్యూరో స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ్యులు బీవీ రాఘ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వులు, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.అరుణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆయన భేటీ అయ్యారు. 

అంతకు ముందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, కార్యదర్శి నారాయణతో సమావేశమై, ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. అనంతరం సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి తాము మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం, సీపీఐ నేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశంలో సీపీఎం నేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఆయన కృత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్ఞత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెలిపారు. 

రాజ్యాంగాన్ని రక్షించడానికి తాను అన్ని విధాలా ప్రయత్నిస్తానని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ.. భార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేశం గొప్ప ఆలోచనను, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని చెప్పారు.

 నిరంకుశ, ఫాసిస్ట్ శక్తులపై పోరాటం రాజకీయ, సైద్ధాంతిక, సాంస్కృతిక ప్రతిఘటన అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విలువలు తుంగలో తొక్కుతున్నారని విమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శించారు. కాగా, సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన సుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శన్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శి డి.రాజా సహా నాయకులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కూడా ఉన్నారు.

ఇండియా కూటమి అభ్యర్థికే మా మద్దతు: డి.రాజా

జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తాము మద్దతు ఇస్తున్నామని సీసీఐ నేషనల్ జనరల్ సెక్రటరీ డి.రాజా తెలిపారు. దేశం మితవాద, మతతత్వ ఫాసిస్ట్ శక్తుల తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందన్నారు. దేశంలో సమాఖ్య పాలనా వ్యవస్థపై దాడి జరుగుతున్న వేళ ఈ ఉప రాష్ట్రపతి ఎన్నిక చాలా కీలకంగా మారిందన్నారు. ఈ సమయంలో రాజ్యాంగ విలువలు, నైతికతను సమర్థవంతంగా నిర్వహించే వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని తాము నమ్ముతున్నట్లు తెలిపారు.