కరోనాపై పోరు..హైదరాబాద్ కేంద్రంగా రీసెర్చ్ సెంటర్స్

కరోనాపై పోరు..హైదరాబాద్ కేంద్రంగా రీసెర్చ్ సెంటర్స్

హైదరాబాద్, వెలుగుప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ ఆట కట్టించేందుకు హైదరాబాద్​లోని రీసెర్చ్ సెంటర్స్ కృషి చేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్ తయారీలో ఉండగా, మరికొన్ని వైరస్ నిర్ధారణ టెస్ట్​లు చేస్తున్నాయి. వెంటిలేటర్లు, మొబైల్​ వైరాలజీ ల్యాబ్​లు తయారుచేసి ప్రభుత్వానికి అందించడం మొదలు జిల్లాల్లో యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్ట్ వరకూ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కోవిడ్​19 పుట్టుక, వ్యాప్తి, వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రీసెర్చ్ చేస్తున్నాయి. హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి.

సెంట్రల్ యూనివర్సిటీలో..

  •   హెచ్ సీయూ లైఫ్​సైన్స్ డిపార్ట్ మెంట్ కి చెందిన  డాక్టర్ సీమా.. ఇమ్యూనిటీ పవర్​పెంచే ‘టి-సెల్ ఎపిటోప్స్’​ వ్యాక్సిన్  తయారు చేశారు.
  •   అడ్వాన్స్​డ్​ ఎలక్ర్టానిక్స్​ ల్యాబ్​కు చెందిన సైంటిస్ట్​లు పహాడీషరీఫ్​లోని ఏఆర్ సీఐతో  బయటి పరిసరాల్లో కరోనాను చంపే మెషీన్ డిజైన్ చేశారు.
  •   పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులను ఆ మెషీన్​పై  ఉంచితే వైరస్​ ఉన్నా చనిపోతుంది.
  •   సోషియాలజీ డిపార్ట్​మెంట్ ​సెర్వ్ పేరుతో కోవిడ్ బాధితులు, ఎంప్లాయీస్​కు సలహాలు ఇస్తోంది.

3 జిల్లాలకు ఎన్ఐఎన్

  • ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు నేషనల్ న్యూట్రిషీయన్ ఇనిస్టిట్యూట్(ఎన్ఐఎన్) జనగామ, నల్గొండ, కామారెడ్డిలో సెరో సర్వేలెన్స్ పేరుతో  యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్ట్ చేయనుంది.
  • ఒక్కో జిల్లాలో 10టీమ్​లు పాల్గొంటాయి.
  • ఈ సర్వేతో వైరస్ కమ్యూనల్  స్ర్పెడ్ జరుగుతుందా, లేదా? అన్నది తేలుతుంది.

మాలిక్యుల్స్ తయారీలో ఐఐసీటీ

  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐసీటీ)కి చెందిన 30 మంది సైంటిస్ట్ లు వ్యాక్సిన్ కోసం మాలిక్యుల్స్ తయారీ ప్రారంభించారు.
  • ఇప్పటిరకు రెమిడెసివిర్, ఆర్బిటాల్ డ్రగ్, యూమిఫెనోవిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాలిక్యుల్స్ రెడీ చేశారు.
  • ఐఐసీటీ ఫార్ములా ఆధారంగా ఫార్మా కంపెనీ సిప్లా మెడిసిన్ తయారుచేసింది. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
  • వైరస్ కంట్రోల్​కు చైనా వాడిన ఆర్బిటాల్ డ్రగ్ నుంచి ఇక్కడి సైంటిస్ట్ లు మరో మాలిక్యుల్ సిద్ధం చేశారు. ఆ మెడిసిన్ అందుబాటులోకి రావడానికి 6 నెలలు పడుతుంది.

వైరస్ జీనోమ్​పై  సీసీఎంబీ ఫోకస్​

  •  తార్నాకలోని  ది సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ).. కోవిడ్​19 ​జీనోమ్​పై రీసెర్చ్ చేస్తోంది.
  • వైరస్​ పుట్టుక, లక్షణాలు, వ్యాప్తి, ఇతర వ్యాధులకు అవకాశాలు.. లాంటి అంశాలపై రీసెర్చ్ జరుగుతోంది.
  • ప్రైవేట్​ ఫార్మా కంపెనీల టెస్టింగ్ కిట్లను వ్యాలిడేషన్ చేస్తోంది.
  • మహారాష్ట్ర, రాజస్థాన్, హైదరాబాద్​లోని పాజిటివ్ కేసుల నుంచి నమూనాలు సేకరించిన సీసీఎంబీ సైంటిస్ట్​లు వైరస్ డీఎన్ఏ, ఉత్పరివర్తనం(మ్యుటేషన్స్)పై కొంత ప్రగతి సాధించారు.
  • ఇప్పటివరకూ 2,500 సస్సెక్టర్స్ శాంపిల్స్​కు పూల్ టెస్టింగ్​చేశారు.
  • కరోనా టెస్ట్ లు ఎలా నిర్వహించాలనే దానిపై 25 మంది డాక్టర్లు, రీసెర్చ్ స్కాలర్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు.

డీఆర్ డీవో.. మొబైల్ వైరాలజీ ల్యాబ్

  • డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్(డీఆర్ డీవో ) తన రీసెర్చ్ సెంటర్ ఇమారత్, కొన్ని ప్రైవేట్ ​సంస్థలతో కలిసి15 రోజుల్లో మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్​ను రెడీ చేసింది.
  • వెయ్యి నుంచి 2 వేల వరకు కరోనా టెస్ట్ లు చేయగల ఈ ల్యాబ్​ను ఇటీవల సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్​ ఆవరణలో
    ప్రారంభించారు.
  • వైరస్ జీనోమ్, వ్యాక్సిన్ ​తయారీ రీసెర్చ్​కూ యూజ్ అవుతుంది.
  • మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను టెస్ట్​ల కోసం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
  • డీఆర్ డీవో 30 వేల వెంటిలేటర్లు,  డిస్ ఇన్ ఫెక్టివ్ టన్నెల్స్ తయారుచేసి ప్రభుత్వానికి అందించింది.

సీడీఎఫ్​డీలో టెస్ట్​లు

  •  సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రిం టింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్ డీ) కరోనా టెస్టుల్లో నిమగ్నమైంది.
  • సీసీఎంబీలో ట్రైనింగ్ తీసుకున్న హెచ్​సీయూ రీసెర్చ్ స్కాలర్స్ 15 మంది బీఎస్ఎల్–​-2 ల్యాబ్ లో ఈ పరీక్షలు చేస్తున్నారు.
  • రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన శాంపిల్స్​ డేటా ఎంట్రీ నమోదు, సార్టింగ్​తోపాటు ఇతర ల్యాబ్స్​ను కో ఆర్డినేట్ చేస్తున్నారు.