కూరగాయలతో క్యాన్సర్​ రిస్క్ తక్కువ

కూరగాయలతో క్యాన్సర్​ రిస్క్ తక్కువ

ఆహారపు అలవాట్లని బట్టి కూడా కొన్ని రకాల హెల్త్​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. అందుకే కూరగాయలు ఎక్కువ తినాలంటారు డాక్టర్లు. కూరగాయలు తింటే క్యాన్సర్​ వచ్చే అవకాశం14 శాతం తక్కువని లండన్​కి చెందిన బిఎంసి మెడిసిన్​ జర్నల్​లో పబ్లిష్​ అయిన స్టడీ చెప్తోంది​. క్యాన్సర్​ రిస్క్​ని పెంచే ఫుడ్ గురించి తెలుసుకునేందుకు యూకె బయో బ్యాంక్​లోని నాలుగు లక్షల యాభైవేల మంది డేటాని స్టడీ చేశారు రీసెర్చర్లు. అందుకోసం తినే తిండిని బట్టి వాళ్లని గ్రూప్​లు​గా విభజించారు. ఒక వారంలో ఐదుసార్లు ప్రాసెస్డ్ మీట్, రెడ్ మీట్​, పౌల్ట్రీ మీట్​ తినేవాళ్లు– వారంలో ఐదుసార్ల కంటే తక్కువ మాంసం తినేవాళ్లు–  చేపలు మాత్రమే తినేవాళ్లు– పూర్తిగా కూరగాయలే తినేవాళ్లు– ఇలా వీళ్లను 4 గ్రూప్​లు​గా చేశారు. స్టడీలో రీసెర్చర్లు గుర్తించిన విషయాలేంటంటే...

మాంసం తినేవాళ్ల కంటే మాంసం తక్కువ తినేవాళ్లకు అన్ని రకాల క్యాన్సర్లు​ వచ్చే రిస్క్​ 2 శాతం తక్కువ. చేపలు తినేవాళ్లు క్యాన్సర్​ బారిన పడే అవకాశం 10 శాతం తక్కువ.  కూరగాయలు తినేవాళ్లలో అయితే క్యాన్సర్​ రిస్క్​14 శాతం తక్కువ. వెజిటేరియన్​  డైట్​ తినే ఆడవాళ్లలో మెనోపాజ్​ తర్వాత బ్రెస్ట్​ క్యాన్సర్​ వచ్చే అవకాశం 18 శాతం తక్కువ. చేపలు తినే మగవాళ్లలో ప్రొస్టేట్​ క్యాన్సర్​ రిస్క్​ 20 శాతం, కూరగాయలు తినే మగవాళ్లలో 31 శాతం తక్కువట. మాంసం, చేపలు తినే వాళ్లతో పోల్చితే కూరగాయలు తినేవాళ్లకు క్యాన్సర్​ వచ్చే అవకాశం చాలా తక్కువని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్​ ఫండ్​, క్యాన్సర్​ రీసెర్చ్​ యూకే, ఆక్స్​ఫర్డ్ పాపులేషన్ హెల్త్ కూడా చెప్తున్నాయి.