- రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గితే
వేములవాడరూరల్, వెలుగు: బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రాజన్నసిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. మంగళవారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా, పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి, చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆదేశించారు.
రౌడీ షీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకట్రాజం, సిబ్బంది ఉన్నారు.
