V6 News

నువ్వే నా హీరో.. మిస్‌ యూ డాడీ  

నువ్వే నా హీరో.. మిస్‌ యూ డాడీ   
న్యూఢిల్లీ : టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా  తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నాడు. తన తండ్రి హిమాన్షును  మిస్‌‌ అవుతున్నానని ఆదివారం స్వయంగా వెల్లడించాడు.  ఇండియా క్రికెటర్లు హార్దిక్‌‌, క్రునాల్‌‌ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా.. కార్డియెక్‌‌ అరెస్ట్‌‌ వల్ల శనివారం కన్నుమూశారు. అయితే, తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని హార్దిక్‌‌ ఇన్‌‌స్టాగ్రామ్‌‌ ద్వారా పంచుకున్నాడు. హిమాన్షు ఫొటోలను షేర్‌‌ చేసిన హార్దిక్‌‌. ‘టూ మై డాడీ, మై హీరో’ అంటూ .ఒక ఎమోషనల్‌‌ మెసేజ్‌‌ దానికి జత చేశాడు. ‘చాలా కష్టమే అయినా జీవితంలో నిన్ను కోల్పోయామనే దానిని  ఒప్పుకోవాలి. కానీ నువ్వు మాకు ఎన్నో మంచి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లావు. నీ నవ్వే ఎప్పుడూ మా మదిలో ఉంటుంది. నీ హార్డ్‌‌వర్క్‌‌, ఆత్మవిశ్వాసం, నమ్మకం వల్లే నీ కొడుకులు ఈ రోజు ఈస్థాయిలో ఉన్నారు. నువ్వు లేని ఇంట్లో సందడి ఉండదు. మేమంతా ఎప్పట్లాగే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. నీ పేరు ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటుంది. పై నుంచి కూడా నువ్వు మా బాగోగులు చూసుకుంటావనే నమ్మకముంది. నువ్వు మా వల్ల గర్వంగా ఫీలవుతావు. కానీ నీ జీవితాన్ని చూసి మేమే గర్వపడతాం. నిన్న నేను వన్‌‌ లాస్ట్‌‌ రైడ్‌‌ అని నీకు చెప్పా. కానీ ఇప్పుడు రెస్ట్‌‌ ఇన్‌‌ పీస్‌‌ మై కింగ్‌‌. జీవితంలో ప్రతీ రోజూ నిన్ను మిస్‌‌ అవుతాను. లవ్‌‌ యూ డాడీ’ అని హార్దిక్‌‌ పాండ్యా తన పోస్ట్​లో రాసుకొచ్చాడు. My daddy As I said to your yesterday Your last one ride. Now rest in peace my king You were a Happy soul! I will miss you everyday dad Love you always pic.twitter.com/hUipWOdjxL — hardik pandya (@hardikpandya7) January 17, 2021