30న కరీంనగర్ కు సీఎం రేవంత్ రెడ్డి..కలెక్టరేట్ను ప్రారంభించనున్న సీఎం

30న కరీంనగర్ కు సీఎం రేవంత్ రెడ్డి..కలెక్టరేట్ను ప్రారంభించనున్న సీఎం

కరీంనగర్/సిరిసిల్ల టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ కొత్త కలెక్టరేట్​ను ప్రారంభించడంతోపాటు సిరిసిల్లలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. 2021లో రూ.51 కోట్లతో కరీంనగర్ ప్రారంభమైన కొత్త కలెక్టరేట్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. జీ ప్లస్ 2 పద్ధతిలో అన్ని హంగులతో నిర్మించిన కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే పలుమార్లు ప్రారంభించాలని భావించినప్పటికీ.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు కాకపోవడంతో వాయిదా పడింది. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ పరిసరాల్లో పచ్చని లాన్, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. ఇక నుంచి నాలుగైదు డిపార్ట్ మెంట్లు తప్పా మిగతా డిపార్ట్ మెంట్ల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి రానున్నాయి. 

సిరిసిల్లలో బహిరంగ సభ

సిరిసిల్లలో నిర్వహించే భారీ బహిరంగకు సీఎం హాజరుకానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా ఈ సభ సాగేలా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించినట్లుగా 8 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూముల కబ్జాలు, నేరేళ్ల బాధితులు, మిడ్ మానేర్ పనుల్లో అక్రమాలు, ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రధానంగా మాట్లాడే అవకాశముంది.

కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలి: విప్ శ్రీనివాస్

సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి విప్​ ఆది శ్రీనివాస్ ​హాజరై మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ ఎస్​పాలనలో సిరిసిల్ల చేనేత రంగం, వేములవాడ రాజన్న ఆలయం, సాగునీటి ప్రాజెక్టులు, జిల్లా అభివృద్ధికి చేసిన కృషిపై కేటీఆర్, కేసీఆర్​సమాధానం చెప్పాలని డిమాండ్ ​చేశారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సుమారు రూ.250 కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు విప్​ తెలిపారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం పెండింగ్​లో ఉంచిన రూ.300 కోట్లను కాంగ్రెస్ ​చెల్లించిందని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం సుమారు రూ.1,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం కలెక్టర్​గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్​బి.గీతేతో కలిసి సీఎం సభ నిర్వహించే స్థలాన్ని విప్ పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ నాగుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్​ కేకే మహేందర్​రెడ్డి, వేములవాడ మున్సిపల్ ​చైర్​పర్సన్​ రాజు తదితరులు పాల్గొన్నారు.